Home న్యూస్ 6 కోట్లు వస్తే….బాహుబలి ఔట్….ఊచకోత కోస్తున్న దేవర!

6 కోట్లు వస్తే….బాహుబలి ఔట్….ఊచకోత కోస్తున్న దేవర!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) రెండో వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. తెలుగు వర్షన్ లో సైతం టాలీవుడ్ చరిత్ర లోనే వన్ ఆఫ్ ది…

హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న సినిమా 10 రోజుల్లో తెలుగు వర్షన్ కి గాను 184.3 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 11వ రోజు సినిమా మరోసారి అన్ని చోట్లా జోరు చూపించి ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో…

వరల్డ్ వైడ్ గా 3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…టోటల్ గా 11 రోజుల వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ షేర్ 188 కోట్ల మార్క్ ని దాటేసింది….కాగా తెలుగు వర్షన్ ఆల్ టైం టాప్ షేర్ ని అందుకున్న మూవీస్ లో ఒక్కో మూవీ రికార్డు ను బ్రేక్ చేస్తూ దూసుకు పోతున్న దేవర మూవీ…

Devara (Telugu Version) 10 DAYS WW Total Collections!!

ఇక్కడ నుండి మరో 6 కోట్ల షేర్ ని దాటేస్తే ఓవరాల్ గా టాలీవుడ్ ఎపిక్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన బాహుబలి(Baahubali1) మూవీ టోటల్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది…బాహుబలి1 మూవీ తెలుగు వర్షన్ లో…

టోటల్ రన్ లో 194 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ప్రస్తుతానికి 188 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న దేవర మరో 6 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంటే బాహుబలి1 తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్ ని దాటేసి ఆల్ టైం టాప్ 5 తెలుగు వర్షన్ ప్లేస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి…

దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండటంతో లాంగ్ రన్ లో ఈ మార్క్ ని దాటేసి తర్వాత ప్లేస్ లో ఉన్న సలార్(Salaar) కి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో దేవర మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

Devara Movie 11 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here