Home న్యూస్ RTC X రోడ్స్ లో ఆల్ టైం టాప్ 5 మూవీస్….దేవర భీభత్సం!!

RTC X రోడ్స్ లో ఆల్ టైం టాప్ 5 మూవీస్….దేవర భీభత్సం!!

0
RTC X Road All Time Top 5 Tollywood Collections
RTC X Road All Time Top 5 Tollywood Collections

తెలుగు స్టేట్స్ లో కొన్ని మేజర్ ఏరియాలు ఉంటాయి, ఆ ఏరియాల్లో వచ్చే కలెక్షన్స్ ని బట్టి ఆ సినిమాలు ఏ రేంజ్ లో విజయాన్ని అందుకున్నాయి అన్నది చెబుతూ ఉంటారు. అలాంటి ఏరియాల్లో సినిమాలకు మెయిన్ సెంటర్స్ గా చెప్పుకునే RTC X రోడ్స్ ముందు నిలుస్తుంది…ఇక్కడ కొన్ని సినిమాలకు ఊహకందని కలెక్షన్స్ సొంతం అయ్యాయి…

టాలీవుడ్ హీరోలలో ఇక్కడ కోటి గ్రాస్ మార్క్ ని చాలా లేట్ గా అందుకున్నాడు అన్న అపవాదుని యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) ఒక టైంలో ట్రోల్స్ ని కూడా ఫేస్ చేశారు….అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తో…

మొదటి రోజే 1 కోటి మార్క్ ని దాటేసి టాలీవుడ్ హీరోలలో ఎవ్వరూ అందుకోలేని రికార్డ్ ను నమోదు చేశాడు…ఇక సినిమాకి మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ సోషల్ మీడియా అంతటా స్ప్రెడ్ అయినా కూడా లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా…

Tollywood All Time Highest Share, Gross Movies!!

11 రోజుల్లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో సినిమా 2.66 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని RTC X రోడ్స్ ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఒకసారి RTC X రోడ్స్ ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…

RTC X Roads, Hyderabad Top 5 Movies Collections
1. #RRRMovie : 5.11Cr
2. #Baahubali2 : 3.76Cr
3. #Kalki2898AD : 3.61Cr
4. #Devara : 2.66Cr (11 Days)****
5. #Rangasthalam : 2.42Cr

మొత్తం మీద ఈ లిస్టుని గమనిస్తే..ఎపిక్ రికార్డులను క్రియేట్ చేసిన సినిమాలు అన్నింటిలో ఒక్క దేవర మాత్రమే భారీగా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…అయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పటి వరకు జోరు చూపించిన దేవర ఇక రన్ ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో రచ్చ చేస్తుందో చూడాలి.

Devara (Telugu Version) 10 DAYS WW Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here