Home న్యూస్ రజినీకాంత్ @ 662 కోట్లు….వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్!!

రజినీకాంత్ @ 662 కోట్లు….వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్(Jailer Movie) మాస్ భీభత్సం సృష్టించిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు మరీ భీభత్సం అనిపించే లెవల్ లో లేక పోయినా కూడా….

జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో బిజినెస్ పరంగా మంచి జోరునే చూపించింది. ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 160 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా రీసెంట్ టైంలో స్లో అయిన రజినీ మార్కెట్ కి తిరిగి ఊపిరి పోస్తూ సాలిడ్ బిజినెస్ నే అందుకుంది..

ఈ ఏజ్ లో కూడా టాప్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రీసెంట్ 5 మూవీస్ టోటల్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 662 కోట్ల మమ్మోత్ బిజినెస్ మార్క్ ని అందుకుంది.

ఒకసారి రీసెంట్ టైంలో రజినీ మూవీస్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#Rajinikanth Recent Movies Business
👉#Vettaiyan – 160CR~******
👉#JAILER – 122.55CR
👉#Annaatthe:- 110CR~
👉#Darbar:- 146.05Cr~
👉#Petta:- 124.25Cr

మొత్తం మీద లాస్ట్ 5 సినిమాల్లో బెస్ట్ బిజినెస్ ను వేట్టయన్ మూవీతో సొంతం చేసుకోగా, ఈ సినిమా హైప్ కొంచం తక్కువ ఉన్నా కూడా ఒక్కసారి పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల్లో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.

ఇక టోటల్ గా రజినీ లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క టోటల్ గా 662 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇప్పుడు బిజినెస్ 132 కోట్ల రేంజ్ లో జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీకి మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here