Home న్యూస్ వేట్టయన్ బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

వేట్టయన్ బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి మరీ లాస్ట్ ఇయర్ వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ జైలర్(Jailer Movie) మూవీ తో పోల్చితే బజ్ లేక పోయినా కూడా వన్స్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే…

మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండగా ప్రజెంట్ సినిమా బుకింగ్స్ ట్రెండ్ పర్వాలేదు అనిపించేలా సాగుతూ ఉంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 160 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా..

తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల లోపే బుకింగ్స్ ను ఇప్పటి వరకు అందుకోగా ఇక్కడ మౌత్ టాక్ నే నమ్ముకుని సినిమా రిలీజ్ కానుండగా, రిలీజ్ అయ్యి టాక్ బాగుంటే షో షోకి జోరు చూపించి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, టాక్ యునానిమస్ గా ఉంటే గ్రోత్ మరింత పెరగవచ్చు…

ఇక తమిళనాడులో ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను అందుకున్న సినిమా మొదటి రోజు ప్రజంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను ఇప్పటి వరకు అందుకోగా…

ఓవర్సీస్ లో 16 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను అందుకున్న సినిమా మొదటి రోజు టాక్ బాగుంటే 26-28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా మొదటి రోజు టాక్ బాగుంటే సినిమా వరల్డ్ వైడ్ గా 62-65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

ఫైనల్ లెక్కలు బాగుంటే 65-70 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, ఆడియన్స్ నుండి రెస్పాన్స్ యునానిమస్ గా ఉంటే ఈ అంచనాలను కూడా మించే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను మించుతుంది ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here