Home న్యూస్ జనక అయితే గనక 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…స్టడీ హోల్డ్!!

జనక అయితే గనక 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…స్టడీ హోల్డ్!!

0
Janaka Aithe Ganaka Movie 5 Days Total WW Collections
Janaka Aithe Ganaka Movie 5 Days Total WW Collections

లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో, ఈ ఇయర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో మంచి హిట్స్ ను అందుకున్నా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వాటిని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి సరైన రెస్పాన్స్ ను అందుకోలేక పోయిన సుహాస్(Suhas) నటించిన లేటెస్ట్ మూవీ జనక అయితే గనక(Janaka Aithe Ganaka Movie)…

ప్రేక్షకుల ముందుకు ఈ దసరా కానుకగా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం దేవర అండ్ ఇతర సినిమాల వలన అనుకున్న రేంజ్ లో జోరు ని చూపించలేక పోయిది.

కానీ పండగ తర్వాత మిగిలిన కొత్త సినిమాలు స్లో అయిన చోట ఈ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా మొత్తం మీద 5 రోజులను పూర్తి చేసుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

Janaka Aithe Ganaka 5 Days Collections Report
👉Nizam: 70L~
👉Total Andhra: 80L~
AP-TG Total:- 1.50CR(2.50CR~ Gross)
👉KA+ROI+OS: 42L~
Total WW Collections: 1.92CR~(3.50CR~ Gross)

మొత్తం మీద 5 రోజుల్లో సినిమా సాధించిన ట్రేడ్ లెక్కలు ఇవి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని అంచనా…ఈ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఇలానే హోల్డ్ ని రెండో వీక్ లో కూడా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here