Home న్యూస్ 112.5 కోట్లకు అమ్మితే 3 వారాల్లో 44 కోట్ల ఎపిక్ జాతర…ఎన్టీఆర్ రికార్డుల రాంపెజ్!

112.5 కోట్లకు అమ్మితే 3 వారాల్లో 44 కోట్ల ఎపిక్ జాతర…ఎన్టీఆర్ రికార్డుల రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైం కన్నా ముందే రిలీజ్ అయినా దసరా పండగ అడ్వాంటేజ్ ను సైతం సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ తనర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టిస్తూ మిక్సుడ్ రెస్పాన్స్ తోనే…

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతుంది ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రోజున 112.55 కోట్ల బిజినెస్ లో సగానికి పైగా రికవరీ చేసినా మిక్సుడ్ రెస్పాన్స్ ఉండటంతో లాంగ్ రన్ లో మిగిలిన అమౌంట్ ను…

Devara Movie 16 Days Total World Wide Collections!!

రికవరీ చేస్తుందో లేదో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ కూడా సినిమా అంచనాలను మించి పోయి మరీ లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించి మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది. మూడో వారంలో కూడా మాస్ హోల్డ్ ని చూపించిన సినిమా…..

దసరా హాలిడేస్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది…టోటల్ గా మూడు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 156.5 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న దేవర మూవీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో…ప్రీ రిలీజ్ బిజినెస్ 112.55 కోట్ల మీద మూడు వారాలు పూర్తి అయ్యే టైంకి…

ఓవరాల్ గా 44 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సాలిడ్ రికవరీతో లాభాలను సొంతం చేసుకుని ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసింది ఈ సినిమా. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Devara Movie 2 Weeks(14 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here