Home న్యూస్ బఘీర ట్రైలర్ రివ్యూ….KGF-సలార్ ల….మాస్ మిక్స్ ఇది!!

బఘీర ట్రైలర్ రివ్యూ….KGF-సలార్ ల….మాస్ మిక్స్ ఇది!!

0

కన్నడ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా సక్సెస్ లు కొన్ని వచ్చాయి…కన్నడ డైరెక్టర్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సిరీస్ అలాగే సలార్ మూవీతో పాన్ ఇండియా వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిన ప్రశాంత్ నీల్ అందించిన కథతో…

ఇప్పుడు కేజిఎఫ్ సలార్ సినిమాలను నిర్మించిన హొంబాలే ఫిలిమ్స్ వాళ్ళు నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ బఘీర(Bagheera Telugu Trailer) సినిమా ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతుంది….కన్నడ లో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్స్ లో ఒకరైన శ్రీ మురళి(Sriimurali)…

మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత కేజిఎఫ్ అలాగే సాలార్ సినిమాల మిక్స్ లా అనిపించింది అని చెప్పాలి…అన్యాయాలను ఎదిరించడానికి, జనాలను కాపాడటానికి…

ఖాకీనే వేయాల్సిన అవసరం లేదు, కాపాడే మనసు ఉంటే చాలు అన్న తల్లి మాటలను పాటిస్తూ సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ గా పెరిగిన హీరో అన్యాయాలను ఎదిరించడానికి ఎవ్వరూ గుర్తు పట్టకుండా బ్లాక్ పాంథర్ తరహా గెటప్ ను వేసుకుని దుర్మార్గులకు చంపుతూ ఉంటాడు…

దాంతో తనని పట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చిక్కకుండా హీరో అనుకున్నది ఎలా సాధించాడు అన్నది సినిమా కథగా బఘీర ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది… ఆల్ మోస్ట్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్నీ కూడా కేజిఎఫ్, సలార్ లను పోలినట్లే అనిపిస్తూ ఉండగా…

ఎలివేషన్ లు, యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది…బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసే అవకాశం ఉన్న సినిమా కేజిఎఫ్, సలార్ రేంజ్ లో సాలిడ్ ఎలివేషన్ లు పడితే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడలో మంచి రచ్చ చేసే అవకాశం ఉంటుంది. ఇతర భాషల్లో ఎలివేషన్ లతో పాటు టాక్ కూడా పాజిటివ్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here