Home న్యూస్ రాజా సాబ్ న్యూ పోస్టర్ అరాచకం….బాక్స్ ఆఫీస్ జాతర ఖాయం!

రాజా సాబ్ న్యూ పోస్టర్ అరాచకం….బాక్స్ ఆఫీస్ జాతర ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కో రకమైన జానర్ లో ఆడియన్స్ ముందుకు రాగా ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన లుక్ తో అదరగొట్టినా కూడా ఒకప్పటి క్లాస్ లవర్ బాయ్ టైప్ లుక్ మాత్రం ప్రభాస్ కి ఏ సినిమాలో సెట్ అవ్వలేదు…

లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ లో కూడా ప్రభాస్ క్లాస్ లుక్స్ అనుకున్న రేంజ్ లో సెట్ అవ్వలేదు. తర్వాత మొత్తం మాస్ టచ్ ఉన్న గెటప్స్ తోనే సినిమాలు చేసిన ప్రభాస్ సలార్ లో ఊరమాస్ లుక్ తో దుమ్ము లేపిన తర్వాత కల్కిలో ప్రభాస్ అదరగొట్టాడు కానీ..

ఒకప్పటి ప్రభాస్ లుక్స్ ను మరిపించేలా ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో చేస్తున్న తన కొత్త సినిమా ది రాజా సాబ్(The Raja Saab Movie) లో ప్రభాస్ లుక్స్ ఆల్ రెడీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి..ఇక లేటెస్ట్ గా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా సినిమా నుండి…

కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ కొత్త పోస్టర్ సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి ఇప్పుడు…ఒకప్పటి డార్లింగ్ మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి రేంజ్ లుక్స్ ను మరిపిస్తూ స్లిమ్ అండ్ క్లాస్ లుక్ తో అదరగొట్టేశాడు ప్రభాస్…మారుతి సైతం ప్రభాస్ లుక్స్ పై…

ఎక్కువ శ్రద్ధ చూపెట్టినట్లు ఈ పోస్టర్ తో కన్ఫాం అవ్వగా ఇక సినిమా నుండి కొత్త టీసర్ ను ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా అక్టోబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. పోస్టర్ లో ఉన్న ప్రభాస్ లుక్ సినిమా మొత్తం మెయిన్ టైన్ చేసి మినిమమ్ ఆకట్టుకునేలా…

ది రాజా సాబ్ మూవీ ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో ప్రభాస్ ఊరమాస్ రికార్డులతో వచ్చే ఏడాది సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 23న రిలీజ్ కానున్న కొత్త టీసర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here