Home న్యూస్ 865 కోట్ల సినిమా తర్వాత మూవీ….కానీ వచ్చిన కలెక్షన్స్ ఇవే!!

865 కోట్ల సినిమా తర్వాత మూవీ….కానీ వచ్చిన కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సినిమాల మీద ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది….అదే ఒక సినిమా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన తర్వాత వచ్చే సినిమా కచ్చితంగా భారీ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తుంది అని అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తారు కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డులను…

తిరగరాసిన సినిమా తర్వాత చేసిన మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది….ఆ సినిమానే బాలీవుడ్ లో రీసెంట్ గా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన స్త్రీ2(Stree 2 Movie) లో హీరోగా అదరగొట్టేసిన రాజ్ కుమార్ రావ్(Raj Kumar Rao)…

నటించిన కొత్త సినిమా విక్కీ విద్య కా వో వాలా వీడియో(Vicky Vidya Ka Woh Wala Video Movie) రీసెంట్ గా దసరా కానుకగా రిలీజ్ అయ్యింది…కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా స్త్రీ2 లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజ్ కుమార్ రావ్ నుండి వచ్చిన మూవీ అవ్వడంతో…

ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వస్తాయి అనుకున్నారు కానీ మొదటి రోజు 5.5 కోట్లతో ఓపెన్ అయిన సినిమా లాంగ్ రన్ లో ఇప్పటి వరకు ఓవరాల్ గా 36.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 50 కోట్ల లోపే గ్రాస్ ను అందుకుంది….. దాంతో స్త్రీ2 లాంటి 865 కోట్ల…

ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన సినిమా తర్వాత చేసిన సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి క్రియేట్ చేయలేక పోయింది ఈ సినిమా….దాంతో ఎపిక్ సక్సెస్ కూడా తర్వాత సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేక పోయింది.

మొత్తం మీద విక్కీ విద్య కా వో వాలా వీడియో బడ్జెట్ రేంజ్ 45 కోట్ల దాకా ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 70 కోట్ల రేంజ్ లో నెట్ కలేక్షన్స్ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా అందులో సగం కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది ఇప్పటి వరకు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here