సంక్రాంతి సీజన్ కానీ, దసరా సీజన్ కానీ ఇతర సీజన్స్ అప్పుడు సినిమాల రేంజ్ ను బట్టి థియేటర్స్ కోసం గొడవలు టాలీవుడ్ లో జరగడం మనం చాలా సార్లే చూశాం….ఈ ఇయర్ సంక్రాంతి టైంలో థియేటర్స్ కోసం గొడవలు ఏ రేంజ్ లో జరిగాయో అందరమూ చూశాము…ఇక ఇప్పుడు ఇదే థియేటర్స్ కోసం గొడవలు బాలీవుడ్ లో మొదలు అయింది….
ఈ అక్టోబర్2 లాంటి నేషనల్ హాలిడే ను వాడుకోకుండా దసరాని కూడా వాడుకోకుండా దీపావళికే రావాలని ఫిక్స్ అయిన 2 క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్స్ సీక్వెల్ మూవీస్ ఇప్పుడు థియేటర్స్ కోసం గొడవలు పడుతూ ఉండగా ఆ ఇంపాక్ట్ వలన సినిమాల బుకింగ్స్ ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు…
ఆ సినిమాలే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికా పదుకునే, అర్జున్ కపూర్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన సింగం అగైన్(Singham Again) సినిమా…అలాగే కార్తీక్ ఆర్యన్, మాదురీ దీక్షిత్ మరియు విద్యాబాలన్ ల కాంబోలో తెరకెక్కిన…
భూల్ భులయ్య3(Bhool Bhulaiyaa 3) సినిమాలు ఆడియన్స్ ముందుకు దీపావళి కి రిలీజ్ కానున్నాయి…కాగా రెండు సినిమాలకు మంచి బజ్ ఉండగా భూల్ భులయ్య మేకర్స్ చేరి సగం థియేటర్స్ ని పంచాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉండగా….
భారీ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సింగం అగైన్ టీం మాకు 65% వరకు థియేటర్స్ కావాలని అంటూ డిమాండ్ చేస్తున్నారట. సినిమా డిస్ట్రిబ్యూషన్ లో PVR చెయిన్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడంతో వాళ్ళు కూడా సింగం అగైన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అంటూ…
భూల్ భులయ్య టీం వాళ్ళు ఆరోపిస్తున్నారు…దాంతో బాలీవుడ్ పెద్దలు ఈ సినిమాలకు థియేటర్స్ పంచె విషయంలో లెక్కలు వేసుకుంటున్నారు….ఈ కారణంగా రెండు క్రేజీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు…మరి ఫైనల్ గా బాలీవుడ్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.