బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కి రీసెంట్ టైంలో సరైన హిట్స్ లేవు, వరుస ఫ్లాఫ్స్ అండ్ అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమాల రిజల్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఒక డిఫెరెంట్ అటెంప్ట్ తో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు క(Ka Movie Business) తో ఈ దీపావళికి భారీగా రాబోతున్నాడు…
పాన్ ఇండియా మూవీగా రూపొందినా కూడా ఇతర భాషల్లో భారీ లెవల్ లో ఉన్న పోటి వలన సినిమా ప్రస్తుతానికి తెలుగు లోనే రిలీజ్ కాబోతూ ఉండగా, సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ బజ్ ఉందని చెప్పాలి ఇప్పుడు. ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వడం కలిసి రాగా…
ఎప్పుడో సినిమా రైట్స్ ను అమ్మేయగా…ఇప్పుడు మేజర్ ఏరియాల్లో డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా కుమ్మేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
KA Movie WW Pre Release Business(Valued)
👉Nizam: 3.6Cr
👉Ceeded: 1.4Cr
👉Andhra: 3Cr
AP-TG Total:- 8CR
👉KA+ROI+OS – 2Cr
Total WW: 10CR(BREAK EVEN – 11CR~)
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే సరిపోతుంది. సినిమా మీద ఇప్పుడు ఆడియన్స్ లో ట్రేడ్ లో డీసెంట్ బజ్ ఉండటంతో టాక్ బాగుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.