రీసెంట్ టైంలో ప్రతీ ఇయర్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్, కొన్ని చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు …ఇలా అనేక సినిమాలు రిలీజ్ అవ్వడం, అలాగే వాటిలో కొన్ని భారీ హిట్స్ అలాగే కొన్ని మంచి సినిమాలు వస్తూ ఉంటాయి…కానీ 2024 ఇయర్ విషయానికి వస్తే ఎలక్షన్స్ ఇంపాక్ట్ వలన…
చాలా సినిమాలు రిలీజ్ లు ఆగిపోయి పోస్ట్ పోన్ అవ్వడంతో చాలా టైం సరైన సినిమాలు లేక థియేటర్స్ అన్నీ కూడా వెలవెలబోయాయి…. ఇక రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని హిట్స్ గా నిలిచినా కూడా చాలా వరకు సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ లానే సొంతం చేసుకున్నాయి…
సంక్రాంతి సీజన్ ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సాధించినా తర్వాత సమ్మర్ లో ఒక హిట్…జూన్ లో ఒక భారీ హిట్ తర్వాత ఇప్పుడు దసరా టైంలో ఒక భారీ హిట్ మాత్రమే ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరి పోశాయి అని చెప్పాలి…ఎక్కువ రోజులు షేర్స్ ని రాబట్టాయి అని చెప్పాలి…
ఇయర్ మొదట్లో వచ్చిన హనుమాన్(HanuMan Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది…31 రోజులకు పైగా అద్బుతంగా రన్ ని కొనసాగించి షేర్స్ ని రాబట్టి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను అందుకుంది….ఇక తర్వాత టిల్లు స్క్వేర్ మూవీ 3 వారాల సూపర్బ్ రన్ ని అందుకోగా…
జూన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్(Prabhas) కల్కి(Kalki 2898 AD) సినిమా సూపర్బ్ పాజిటివ్ టాక్ తో రిమార్కబుల్ లాంగ్ రన్ ను అందుకుని 7 వారాల పాటు షేర్స్ ని రాబట్టి ఎపిక్ రన్ ను అందుకుంది…. ఇక ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన
ఎన్టీఆర్(Jr NTR) దేవర(Devara Movie) మిగిలిన మూవీస్ తో పోల్చితే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…. ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు…5 వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ షేర్స్ ని…
సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించింది…ఈ ఇయర్ ఈ సినిమాలను పక్కకు పెడితే మిగిలిన సినిమాల రన్ అంతంత మాత్రమే ఉండగా ఈ సినిమాలు మాత్రం సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ మంచి సినిమాలు వస్తే లాంగ్ రన్ అందుకునే అవకాశం ఎంతైనా ఉందని నిరూపించాయి…
ఇక ఇయర్ ఎండ్ వరకు చూసుకుంటే మిగిలిన సినిమాల్లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ కి టాక్ బాగుంటే సాలిడ్ లాంగ్ రన్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. అది జరిగితే ఈ ఇయర్ ఓవరాల్ గా నిరాశ పరిచినా కొన్ని సినిమాల రన్ అప్ కమింగ్ మూవీస్ కి ఊపిరి పోశాయి అని చెప్పాలి.