ఈ దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చే సినిమాల్లో ట్రైలర్ తోనే మంచి అంచనాలను పెంచేసి ఒక్కసారిగా బజ్ పెరిగేలా చేసుకున్న క్రేజీ మూవీ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోగా…
ఓవరాల్ గా సినిమాకి బజ్ పెరగడంతో బిజినెస్ కూడా సాలిడ్ గానే జరిగింది అన్ని చోట్లా కూడా…తెలుగు రాష్ట్రాలలో సైతం అనుకున్న దాని కన్నా బెటర్ బిజినెస్ ను చేసిన సినిమా నైజాంలో 5.5 కోట్లు సీడెడ్ లో 2.20 కోట్లు అలాగే కోస్టల్ ఆంధ్రలో 6.5 కోట్ల మేర…
బిజినెస్ ను చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా 14.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. దాంతో తెలుగు లో ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే…
Lucky Baskhar Movie Total World Wide Pre Release Business(Valued)
👉Telugu States- 14.20Cr
👉Kerala – 3.20Cr
👉Tamilnadu – 1.5Cr
👉Ka+ROI – 3.50Cr
👉Overseas – 4.50CR~
Total WW Business – 26.90CR(Break Even – 28CR~)
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 27 కోట్ల లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే 28 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. టాక్ డీసెంట్ గా ఉంటే కచ్చితంగా టార్గెట్ ను సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.