బాక్స్ అఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా దీపావళి కానుకగా భారీ లెవల్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ లో ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ను దక్కించుకున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie Review) భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా…
ముందుగా ప్రీమియర్స్ ను అలాగే ఇక్కడ స్పెషల్ షోలను కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. ఓవరాల్ గా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ చాలా బెటర్ గా ఉందని చెప్పాలి. స్టోరీ పాయింట్ పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ…
మిడిల్ క్లాస్ లైఫ్ ను లీడ్ చేస్తున్న హీరో లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండగా సడెన్ గా తన అకౌంట్ లో లెక్కకుమించి డబ్బు వస్తుంది…ఆ తర్వాత ఏం జరిగింది, ఆ డబ్బు వలన తన లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా స్టార్ట్ అవ్వడం…
సింపుల్ గా స్టార్ట్ అయ్యే సినిమా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తర్వాత ఆసక్తి కరమైన సన్నివేశాలతో సాగుతూ స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మంచి సీన్స్ తో ఇంటర్వెల్ వరకు రేసీ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటూ మంచి ఇంటర్వెల్ పాయింట్ తో సెకెండ్ ఆఫ్ పై…
అంచనాలను పెంచగా సెకెండ్ ఆఫ్ కథ ఆసక్తిగానే సాగుతూ అక్కడక్కడా కొంచం డౌన్ అయినట్లు అనిపించినా కూడా చాలా వరకు సీన్స్ అంచనాలను తగ్గట్లు సాగి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి జోరు అందుకుని క్లైమాక్స్ ఆసక్తిగా ముగిసి చాలా వరకు అంచనాలను అందుకుంది అని చెప్పాలి.
ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ కథ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది… మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైంకి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో మెప్పించింది అని చెప్పాలి…
మొత్తం మీద ప్రీమియర్స్ అండ్ స్పెషల్ షోలకి లక్కీ భాస్కర్ మూవీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక ఇదే రేంజ్ లో టాక్ ను రెగ్యులర్ షోలకు కొనసాగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…