బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో రూపొందిన రియల్ స్టోరీ మీద తెరకెక్కిన అమరన్(Amaran Movie Review) మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే రియల్ కథ నేపద్యంలో వచ్చిన అమరన్ తమిళనాడుకి చెందినా ముకుంద్ వరదరాజ్ కి హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) కి పరిచయం ఎలా జరిగింది. ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది. ఇక ముకుంద్ చీతా వింగ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి విజయాలు దక్కించుకున్నాడు….ఆ క్రమంలో ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
రియల్ ఇంసిడెంట్ ల మీద బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా కొంచం లవ్ స్టోరీని మిక్స్ చేసినా దేశభక్తి సీన్స్ కి కొదవ లేదు అని చెప్పాలి. కొన్ని ఆసక్తి కరమైన వార్ సీన్స్, కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ అన్నీ కూడా బాగా మెప్పించాయి. ఇక ఎమోషనల్ టచ్ ఉన్న సీన్స్ కూడా సినిమాలో బాగా తీశారు…
క్లైమాక్స్ పోర్షన్ మొత్తం థియేటర్స్ లో చూస్తున్న ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు తిరగడం ఖాయమని చెప్పాలి… ఇక పెర్ఫార్మెన్స్ పరంగా శివ కార్తికేయన్ ముకుంద్ రోల్ లో జీవించేశాడు. తన కెరీర్ లో బెస్ట్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా…సాయి పల్లవి మరోసారి…
తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. మిగిలిన యాక్టర్స్ కూడా బాగానే నటించగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.
రియల్ ఇంసిడెంట్స్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ కథని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా రూపొంచారు..అక్కడక్కడా కథ కొంచం స్లో అవ్వడం, డ్రాగ్ అవ్వడం లాంటివి జరిగినా కూడా ఎక్కువ శాతం సినిమా ఆడియన్స్ తర్వాత సీన్ ఏమవుతుంది అన్న ఆసక్తిని చాలా టైం వరకు మెయిన్ టైన్ చేయగా…
సెకెండ్ ఆఫ్ లో హెవీ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి కానీ అవి అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి. మొత్తం మీద అమరన్ సినిమా బయోపిక్స్ లో వచ్చిన వన్ ఆఫ్ డీసెంట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది….
శివ కార్తికేయన్ అండ్ సాయి పల్లవిల ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ కోసం, పార్టు పార్టులుగా వచ్చే మంచి సీన్స్ కోసం, అలాగే ఎమోషనల్ క్లైమాక్స్ కోసం కచ్చితంగా చూసి తీరాల్సిందే….రీసెంట్ టైంలో వచ్చిన బయోపిక్స్ లో మంచి బయోపిక్ అని చెప్పొచ్చు. సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్..