3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ 100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి ఊచకోత కోసిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) తెలుగు రాష్ట్రాల్లో ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలలోకి ఎంటర్ అయ్యి లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతుంది…
ఇక సినిమా ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మాస్ ఊచకోత కోసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా, తమిళనాడులో మరింత జోరు చూపించి ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మిగిలిన చోట్ల కూడా..
సినిమా రాంపెజ్ కొనసాగిస్తూ ఉండటం విశేషం, నాలుగో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపెడుతూ ఉండగా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక తమిళనాడులో సినిమా మరోసారి 16 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కేరళ, కర్ణాటక లో కూడా కుమ్మేస్తున్న సినిమా ఓవర్సీస్ లో కూడా మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉంది ఇప్పుడు… దాంతో టోటల్ గా 4వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు….
మరోసారి 30 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బిజినెస్ మొత్తాన్ని వీకెండ్ లో రికవరీ చేయబోతున్న సినిమా వర్కింగ్ డేస్ లో లాభాలలోకి ఎంటర్ కాబోతుంది. ఇక టోటల్ గా 4 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.