Home న్యూస్ లక్కీ భాస్కర్-క-అమరన్….5th డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

లక్కీ భాస్కర్-క-అమరన్….5th డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
Ka Movie 5th Day Box Office Collections- Lucky Baskhar 5th Day Collections - Amaran 5th Day Collections
Ka Movie 5th Day Box Office Collections- Lucky Baskhar 5th Day Collections – Amaran 5th Day Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలు 4 రోజుల లాంగ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపాయి…

ఇక అన్ని సినిమాలు కూడా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా వేటి రేంజ్ లో అవి బాగానే హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మూడు సినిమాలు మంచి జోరునే చూపెడుతూ ఉండగా అన్ని సినిమాలకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…

60-65% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా లక్కీ భాస్కర్ మూవీ 5వ రోజు మొత్తం మీద 1 కోటికి పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు…ఇక అమరన్ అలాగే క సినిమాలు కూడా సేం రేంజ్ లో డ్రాప్స్ ఉండగా…

మాస్ సెంటర్స్ లో క కొంచం బెటర్ గా ఉండటంతో సినిమా 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 90 లక్షల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకోవచ్చు. ఇక అమరన్ మూవీ కూడా 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక వరల్డ్ వైడ్ గా క మూవీ 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా లక్కీ భాస్కర్ మూవీ 5వ రోజు వరల్డ్ వైడ్  4 కోట్ల రేంజ్ నుండి ఆ పైన గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఇక అమరన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ నాడులో…

రిమార్కబుల్ జోరుని చూపెడుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 15-16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద మూడు సినిమాలు ఈ రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here