బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ తో ఒక టైంలో తను సొంతం చేసుకున్న డీసెంట్ మార్కెట్ ను పూర్తిగా కోల్పోయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ అయిన మట్కా(Matka 1st Day Collections) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా…
ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది…సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది, సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు, సినిమా కోసం భారీ లెవల్ లో ప్రమోషన్స్ కూడా చేశాడు కానీ…
సినిమా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల రేంజ్ లోనే షేర్ ని ఓపెనింగ్ డే రోజున సొంతం చేసుకున్నట్లు చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా సినిమా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయింది…
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల ఆవల టోటల్ గా మరో 12 లక్షల రేంజ్ లోపే షేర్ ని అందుకోగా మొదటి రోజు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకున్నట్లు అంచనా…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా…
మినిమమ్ 18.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది. ఇక వీకెండ్ లో ఊహకందని రేంజ్ లో గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ సినిమాతో వరుస ఫ్లాఫ్స్ కి బ్రేక్ పడి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాను అని నమ్మకంగా ఉన్న వరుణ్ తేజ్ కి మట్కా మూవీ గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్లు అయింది. ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.