సినిమాలను ప్రమోట్ చేసుకునే పనిలో అప్పుడప్పుడు నిర్మాతలు సినిమా యాక్టర్ లు ఓవర్ ది బోర్డ్ కి వెళ్ళిపోయి స్టేట్ మెంట్స్ ఇస్తూ ఉంటారు…సినిమా అంచనాలను అందుకుంటే ఓకే కానీ ఏమాత్రం తేడా కొట్టినా కూడా అసలుకే ఎసరు వస్తుంది….ఇలాంటి స్టేట్ మెంట్స్ లు రీసెంట్ టైంలో మరీ ఎక్కువ అవుతూ ఉండటం అందరినీ ఆశ్యర్య పరుస్తుంది..
ఆచార్య టైంలో రాజమౌళి మిత్ ని బ్రేక్ చేస్తుంది అన్నారు..అసలుకే ఎసరు వచ్చింది…లైగర్ టైంలో లెక్క 200 కోట్ల నుండి మొదలు అన్నారు, ఎపిక్ డిసాస్టర్ అయింది. దేవర గేమ్ ఆఫ్ త్రోన్స్ కి మించి ఉంటుంది అన్నారు…అసలు ఆ కథతో సంభందమే లేదని తర్వాత తెలిసింది…
ఇక లేటెస్ట్ గా కోలివుడ్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేస్తుంది అని ఎంతో నమ్మకంతో సూర్య(Suriya) నటించిన కంగువ(Kanguva) సినిమాను నిర్మించిన జ్ఞానవేల్ రాజా కంగువ విషయంలో అవసరానికి మించి ఎన్నో స్టేట్ మెంట్స్ ఇచ్చాడు…
తమ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంచనాలు 2000 కోట్ల రేంజ్ లో ఉంటాయని అంచనా వేస్తున్నామని చెప్పారు, సినిమాను 38 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు….సినిమా చూసే ఆడియన్స్ కి ఊహకందని రేంజ్ లో విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ను కంగువ ఇస్తుంది అన్నారు…
ఇలా ఎన్నో స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో కోలివుడ్ ట్రేడ్ వర్గాలు కంగువ మరీ 2000 కోట్ల మార్క్ ని నమ్మకున్నా కోలివుడ్ తరుపున మొదటి 1000 కోట్ల సినిమా అవుతుందేమో అని ఆశ పడ్డారు…కానీ రిలీజ్ విషయంలో ఎదురుదెబ్బ తగలగా ఓపెనింగ్స్ అంచనాలను ఏమాత్రం అందుకోలేదు…
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక ఇప్పుడు వీకెండ్ లో 100 కోట్ల మార్క్ ని కూడా అందుకోలేని పరిస్థితికి వచ్చింది…ఓవర్ గా సినిమాను హైప్ ఇవ్వాలని ఆడియన్స్ లో అంచనాలను పెంచితే ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చి కోలివుడ్ లో ఆల్ టైం డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచే పరిస్థితి నెలకొంది…