బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో ఆశలు అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోవడం లేదు.
మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయిన సినిమా రెండో రోజు నుండి కూడా హోల్డ్ ని చూపించ లేక పోయింది. ఇక 4వ రోజు సినిమాకి సండే అడ్వాంటేజ్ లభించినా కూడా మాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన చోట…
పెద్దగా హోల్డ్ ని అయితే చూపించ లేక పోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా మరోసారి 3 వ రోజు కి అటూ ఇటూగానే ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
సినిమా తమిళనాడులో సినిమా 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా 3.5-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా 3.5-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద సినిమా…
వరల్డ్ వైడ్ గా 4వ రోజు 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉంది. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా చాలా గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా 4 రోజుల వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…