బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే నెలలో రికార్డుల ఊచకోత కోయడానికి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా రాంపెజ్ చూపించడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి…
ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా ఫాస్టెస్ట్ లైక్స్ విషయంలో కొత్త రికార్డులను నమోదు చేయలేక పోయినా కూడా వ్యూస్ పరంగా మాత్రం ట్రైలర్ సంచలన వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ఇప్పుడు…
ప్రీవియస్ ట్రైలర్ వ్యూస్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది….ఇది వరకు టాలీవుడ్ ట్రైలర్స్ పరంగా చూసుకుంటే మహేష్ బాబు(Mahesh Babu) నటించిన గుంటూరు కారం(Guntur Kaaram) ట్రైలర్ 24 గంటల్లో సాధించిన రికార్డ్ వ్యూస్ ను బ్రేక్ చేసింది…
గుంటూరు కారం ట్రైలర్ 37.68 మిలియన్ లైక్స్ ని అందుకుని రికార్డ్ కొట్టగా టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీ పరంగా కూడా ఈ ట్రైలర్ టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు పుష్ప2 ట్రైలర్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది…అది కూడా జస్ట్ 15 గంటల లోపే ఈ వ్యూస్ రికార్డ్ ను…
బ్రేక్ చేసి 38 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ టాలీవుడ్ తరుపునే కాకుండా ఏకంగా సౌత్ తరుపున కూడా బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాయి….
ఇక లైక్స్ పరంగా 15 గంటలు పూర్తి అయ్యే టైంకి 773K లైక్స్ మార్క్ ని దాటేసి 1 మిలియన్ లైక్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. ఇక మొత్తం మీద 24 గంటల్లో పుష్ప2 ట్రైలర్ ఏ రేంజ్ లో రికార్డుల జాతర సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు….