ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ….ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ ను సరిగ్గా అర్ధం చేసుకోకపోతే ఇలాంటిదే జరుగుతుంది… లేటెస్ట్ గా కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది…సినిమా మొదటి ఆటకే సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది….
సినిమాలో సౌండింగ్ ఏమాత్రం బాలేదని, ఎడిటింగ్ ఏమాత్రం బాలేదని….లెంత్ మరీ ఎక్కువ అయింది అన్న విమర్శలు సోషల్ మీడియా మొత్తం పోస్ట్స్ పడ్డాయి…ఇలాంటి టైంలో ఏ సినిమా టీం అయినా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పరిస్థితులను సరిదిద్దాలని ట్రై చేస్తారు…
కానీ కంగువ మేకర్స్ మాత్రం మొదటి రోజు సినిమాకి వచ్చిన టాక్ చూసి మాకు గ్రౌండ్ లెవల్ లో రిపోర్ట్ లు చాలా బాగానే ఉన్నాయని, సౌండింగ్ విషయంలో థియేటర్ ఓనర్ లు ఓ రెండు పాయింట్స్ సౌండ్ తగ్గించుకుంటే సరిపోతుంది అంటూ కామెంట్ చేశారు…
దాంతో మరింతగా సినిమా మీద ట్రోల్స్ పెరిగిపోయాయి…కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి. ఇలాంటి టైంలో చేసేదేమీ లేక 5వ రోజున సినిమా లెంత్ ను మొత్తం మీద 12 నిమిషాలు తగ్గించగా, సౌండ్ ప్రాబ్లం ఇష్యూని సెట్ చేసి రీ ఎడిట్ చేసి సినిమాను…
క్రిస్ప్ రన్ టైంతో 2 గంటల 22 నిమిషాలుగా మార్చారని అప్ డేట్ చేశారు…ఇదే పని రిలీజ్ కి ముందే చూసుకుని ఉంటే బాగుండేదని…కానీ అప్పుడూ ఓవర్ కాన్ఫిడెంట్స్ తో ఉన్న మేకర్స్… రిలీజ్ రోజున వచ్చిమ ఫీడ్ బ్యాక్ ని అయినా పట్టించుకుని ఉంటే బాగుండేదని…
ఇప్పుడు 5వ రోజు కంప్లీట్ గా క్రాష్ అయ్యాక పరిస్థితులు తిరిగి నార్మల్ చేయాలనీ చూసినా కూడా ఇప్పటికే మునిగిపోయిన సినిమా ఇక తిరిగి తేరుకునే అవకాశమే లేదని చెప్పొచ్చు… ఇక ఈ రీ ఎడిట్ చేసిన వర్షన్ తో కలెక్షన్స్ లో ఏమైనా గ్రోత్ ఉంటుందో లేదో చూడాలి ఇక…