వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తుంది అని ఎంతో అనుకున్నా కూడా మొదటి రోజే అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది.
ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూనే వచ్చిన సినిమా మొదటి వారాన్ని అతి కష్టం మీద కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక చేతులు ఎత్తేసింది…. ఓవరాల్ గా సినిమా…
8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కొండంత టార్గెట్ కి ఆమడ దూరంలో ఆగిపోయింది ఇప్పుడు.
మొత్తం మీద 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 8 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 3.50Cr~
👉Ceeded: 1.20Cr~
👉Andhra: 3.83Cr~
AP-TG Total:- 8.53CR(14.95Cr~ Gross)
25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా మరో 16.47 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 8 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 30.35Cr
👉Telugu States – 14.95Cr
👉Karnataka – 4.70Cr
👉Kerala – 6.20Cr
👉Hindi+ROI – 14.15Cr
👉Overseas – 22.90Cr***approx
Total WW collection – 93.25CR(44.75CR~ Share) Approx
సినిమా 180 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 135.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. అది అసాధ్యం కాబట్టి ఇక ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్ గా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.