Home న్యూస్ దేవకీ నందన వాసుదేవ మూవీ రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

దేవకీ నందన వాసుదేవ మూవీ రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో అశోక్ గల్లా(Ashok Galla) హీరోగా చేసిన కొత్త సినిమా దేవకీ నందన వాసుదేవ(Devaki Nandana Vasudeva Movie Review) సినిమా ఒకటి కాగా, హనుమాన్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ అందించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

మెయిన్ కథ పాయింట్ కి వస్తే…విలన్ కి తన చెల్లెలి మూడో సంతానం వలన ప్రాణహాని ఉందని ఒక శివ సాదువు చెప్పడంతో, ఆ సంతానాన్ని అడ్డు తొలగించాలి అనుకున్నా అనుకోకుండా జైలుకి వెళతాడు…21 ఏళ్ల తర్వాత హీరోయిన్ ని చూసి ఇష్టపడే హీరో లవ్ స్టోరీలోకి విలన్ ఎంటర్ అవుతాడు….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది అసలు కథ…

సినిమా చూసిన తర్వాత ఇది అసలు ప్రశాంత్ వర్మ అందించిన కథనేనా అనిపిస్తుంది…మైతలాజిక్ టచ్ ఉన్న పాయింట్ ను పట్టుకున్నప్పటికీ ప్రజెంట్ టైంలో అది మూడనమ్మకంగానే అనిపిస్తుంది అని కూడా గమనించకుండా ఆ కథతో సినిమా తీయాలి అని డిసైడ్ అయితే…

కథనంలో, స్క్రీన్ ప్లే లో, లవ్ సీన్స్ లో, హీరో విలన్ ల మధ్య పోటి ఇలా అనేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ దేవకీ నందన వాసుదేవ విషయంలో అలాంటిది ఏమి జరగలేదు, హీరో హీరోయిన్స్ ల మధ్య లవ్ సీన్స్ చాలా పేలవంగా ఉండగా…

హీరో విలన్ ల మధ్య సీన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు…నత్తనడకన సాగే కథ కొద్ది సేపటికే బోర్ ఫీల్ అయ్యేలా చేయగా మైతలాజిక్ టచ్ తో ఉన్న కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా ఏ దశలో కూడా సినిమా హనుమాన్ డైరెక్టర్ అందించిన కథలా అయితే అనిపించలేదు…

హీరో అశోక్ గల్లా రెండో సినిమానే అయినా పర్వాలేదు అనిపించేలా నటించాడు, యాక్షన్ సీన్స్ లో కూడా పర్వాలేదు అనిపించాడు..హీరోయిన్ కూడా చూడటానికి బాగుంది, యాక్టింగ్ ఓకే….మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించగా సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోరింగ్ అనిపించేలా ఉండగా కొన్ని సీన్స్ మినహా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను ఆకట్టుకునే విధంగా చెప్పలేక పోయాడు….ఓవరాల్ గా హనుమాన్ మూవీ…

డైరక్టర్ అందించిన కథ అని ఏమైనా అంచనాలు పెట్టుకుని వెళితే మట్టుకు ఎక్కువ నిరాశ కలిగిస్తుంది..ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్ళినా చాలా ఓపికతో చూస్తె అతి కష్టం మీద ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here