భారీ బడ్జెట్ తో వచ్చి కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుంది అనుకున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా, మొదటి రోజే ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత…
తొలిరోజు కలెక్షన్స్ నుండే ఏమాత్రం జోరు చూపించ లేక పోయిన సినిమా వర్కింగ్ డేస్ లో కూడా భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఎలాగోలా మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా….
9వ రోజు కొత్త వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో కొత్త సినిమాల నుండి పోటి వలన మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా కోటి లోపే గ్రాస్ మార్క్ లోకి వెళ్లి 74 లక్షల గ్రాస్ ను 35 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా మొత్తం మీద 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 9 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 3.54Cr~
👉Ceeded: 1.21Cr~
👉Andhra: 3.86Cr~
AP-TG Total:- 8.61CR(15.10Cr~ Gross)
25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 16.39 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.
ఇక సినిమా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 9 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 30.75Cr
👉Telugu States – 15.10Cr
👉Karnataka – 4.72Cr
👉Kerala – 6.22Cr
👉Hindi+ROI – 14.20Cr
👉Overseas – 23.00Cr***approx
Total WW collection – 93.99CR(45.10CR~ Share) Approx
మొత్తం మీద 180 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 135 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 9వ రోజు సింగిల్ డిజిట్ లోకి వచ్చేసిన సినిమా ఇక ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…