బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సత్యదేవ్(Satyadev) నటించిన లేటెస్ట్ మూవీ అయిన జీబ్రా(Zebra Movie) సినిమా, యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన కొత్త సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky) సినిమాలు వీకెండ్ ని పూర్తి చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టాయి…
రెండు సినిమాల్లో రివ్యూలు మెకానిక్ రాకీ బెటర్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం వీకెండ్ లో పెద్దగా జోరు చూపించ లేక పోయింది….ఇక రివ్యూలు మిక్సుడ్ గా ఉన్నా కూడా జీబ్రా మూవీ మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి….
వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….ఇక రెండు సినిమాలు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా రెండు సినిమాలు కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి….మెకానిక్ రాకీ మూవీ కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ సండే తో పోల్చితే…
మండే సినిమా 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 30 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు….ఇక జీబ్రా మూవీ కూడా సండేతో పోల్చితే మందే రోజున ఆల్ మోస్ట్ 55% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ ఉండగా…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 40 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద రెండు సినిమాల వర్కింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…