Home న్యూస్ 27 కోట్ల బడ్జెట్….విశ్వం టోటల్ ప్రాఫిట్-లాస్ రిపోర్ట్ ఇదే!!

27 కోట్ల బడ్జెట్….విశ్వం టోటల్ ప్రాఫిట్-లాస్ రిపోర్ట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ శ్రీనువైట్ల(Sreenu Vaitla) డైరెక్షన్ లో రూపొందగా సినిమా దసరా టైంలో రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరు చూపించక పోవచ్చు అనుకున్నా కూడా సినిమా లాంగ్ రన్ లో…

మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని మంచి రికవరీని సాధించి రన్ ని కంప్లీట్ చేసుకుంది…కానీ ఓవరాల్ గా సినిమా బడ్జెట్ ప్రమోషన్స్ తో కలిపి 27 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా బడ్జెట్ మీద మేకర్స్ కి ప్రాఫిట్ వచ్చిందా లేదా అన్న వివరాలను గమనిస్తే…

ముందుగా సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా మంచి బిజినెస్ నే చేసింది….ఓవరాల్ గా డిజిటల్ రైట్స్ కింద 11.50 కోట్ల దాకా రికవరీని సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ కలిపి 10 కోట్ల మేర రికవరీ చేసింది….దాంతో టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్…

21.50 కోట్ల దాకా రికవరీని అందుకోగా ఇక థియేట్రికల్ బిజినెస్ 10 కోట్లకు పైగా ఉంటే టోటల్ రన్ లో 9 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎబో యావరేజ్ గా నిలిచినా కూడా ఓవరాల్ గా బడ్జెట్ మీద సినిమా టోటల్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి….

మొత్తం మీద సినిమా 30.60 కోట్ల రేంజ్ లో రికవరీని ఓవరాల్ గా సొంతం చేసుకుంది…బడ్జెట్ మీద మరీ అద్బుతం కాదు కానీ ఓవరాల్ గా అన్ని కలిపి మేకర్స్ కి లైట్ గా ప్రాఫిట్స్ అయితే సొంతం అయ్యాయి అని చెప్పొచ్చు ఈ లెక్కల ప్రకారం…కొంచం బెటర్ కంటెంట్ తో వచ్చి ఉంటే కచ్చితంగా ఇంకా బెటర్ రిజల్ట్ ను సినిమా సొంతం చేసుకుని ఉండేది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here