బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 5వ వారంలో ఓటిటి రిలీజ్ ను సొంతం చేసుకున్నాక కూడా థియేటర్స్ లో రచ్చ చేస్తూ రోజు 5-7 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ ఎపిక్ రన్ ను కొనసాగిస్తున్న….దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) సినిమా…
ఓవరాల్ గా ఇప్పటి వరకు 112 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఎపిక్ లాభాలను సొంతం చేసుకున్నాక కూడా డిజిటల్ లో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను ఇప్పుడు…
సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా నెట్ ఫ్లిక్స్ లో సినిమా అన్ని భాషల వర్షన్ లు రిలీజ్ అవ్వగా….బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రెస్పాన్స్ తో కుమ్మేసిందో ఇక్కడ కూడా యునానిమస్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తుంది…
సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా ఏమాత్రం టెంపో తగ్గకుండా, ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా డైరెక్టర్ కథ చెప్పిన తీరు బాగా ఆకట్టుకుంది అంటూ మెచ్చుకుంటున్నారు….అలాగే సినిమాలో ఫ్యామిలీ సీన్స్ అలాగే, హీరో డైలాగ్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకోగా…
నగల షాప్ లో వచ్చే సీన్ కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయని…విజిల్ వర్త్ సీన్స్ తో నిండిపోయిన లక్కీ భాస్కర్ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటి అని అంటున్నారు డిజిటల్ లో….తెలుగు ఆడియన్స్ తో పాటు సౌత్ లో…
ఇతర భాషల ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తూ ఉండటం విశేషం, సినిమాలో హర్షద్ మెహతా సీన్స్ లో మాత్రం ఒక్కసారి స్కాం 92 బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా సీన్ కానీ వాడి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా డిజిటల్ లో కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది సినిమా…