Home న్యూస్ 100 కోట్ల సింహాసనంపై అల్లు అర్జున్…అసలు ఊచకోత ముందుంది!!

100 కోట్ల సింహాసనంపై అల్లు అర్జున్…అసలు ఊచకోత ముందుంది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ…

దూసుకు పోతూ ఉండగా సినిమా ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క ఇప్పుడు 100 కోట్ల మమ్మోత్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…అల్లు అర్జున్ కెరీర్ లో మొట్ట మొదటి సారిగా ఈ రేంజ్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న పుష్ప2 మూవీ…

రిమార్కబుల్ ట్రెండ్ ను అన్ని చోట్లా చూపెడుతూ ఉండగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓవర్సీస్ నుండి ఆల్ మోస్ట్ 4 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని సొంతం చేసుకుంది. ఇండియన్ కరెన్సీ ఆల్ మోస్ట్ 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇండియాలో సినిమా హిందీ బుకింగ్స్ ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత కొంచం స్లో డౌన్ అయినా తెలుగు వర్షన్ అలాగే ఇతర భాషల వర్షన్ ల బుకింగ్స్ ట్రెండ్ బాగానే జోరు చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా 70 కోట్లకు పైగా గ్రాస్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుని…

మాస్ రచ్చ చేస్తూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి 104 కోట్ల గ్రాస్ బుకింగ్స్ తో ఎపిక్ రచ్చ చేస్తూ టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ దిశగా దూసుకు పోతుంది. ఇక టాక్ ఒక్కటి పాజిటివ్ గా ఉంటే మొదటి రోజు రికార్డుల జాతర ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here