బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ అంచనాల నడుమ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie Review) సినిమా రికార్డ్ లెవల్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అయింది…మొదటి పార్ట్ వరల్డ్ వైడ్ సూపర్ సక్సెస్ తర్వాత అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిన నేపధ్యంలో రెండో పార్ట్ ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ….
ముందుగా కథ పాయింట్ కి వస్తే….మామూలు కూలీ నుండి సిండికేట్ లీడర్ గా ఎదిగిన పుష్ప రాజ్ కి పోలిస్ షెఖావత్ కి గొడవతో పార్ట్ 1 ముగుస్తుంది, పుష్ప మీద అప్పటి నుండి పగతో రగిలిపోతున్న షెఖావత్ సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే టైంలో అంచలంచలుగా ఎదుగుతున్న పుష్ప మీద విలన్స్ అందరూ కలిసి పగ ఎలా తీర్చుకోవాలని ట్రై చేశారు….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా కథ…
అదేంటి సీక్వెల్ కథ ఇలానే ఉంటుంది అని ముందే తెలిసిన కథనే కదా…కొత్త పాయింట్ ఏమి లేదా అని మీకు డౌట్ రావొచ్చు….ఇది సీక్వెల్ అయినా కూడా సుకుమార్ చెప్పాల్సిన కథని మొదటి పార్ట్ లోనే చెప్పాడు…ఒక మామూలు కూలీ నుండి సిండికేట్ లీడర్ గా ఎదిగే క్రమంలో హీరో పడిన కష్టం, తన లవ్ స్టోరీ…ఫ్యామిలీ ప్రాబ్లం ఇలా అన్నీ మొదటి పార్ట్ లోనే ఉన్నాయి…
రెండో పార్ట్ లో కథ పాయింట్ విషయంలో కొత్త పాయింట్ ఏమి లేక పోయింది చెప్పడానికి, మరి ఆడియన్స్ ను 3 గంటల సేపు ఎలా కూర్చోబెట్టాలి…అప్పుడే లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్కలు వేసుకున్నారు…. హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో కథని ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా ఒక ఫ్లోలో నడుపుతూ పోయాడు….
దాంతో ఫస్టాఫ్ అంతా చకచకా సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో హై ఇస్తూ సాగి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగిపోతుంది….ఇక సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అయిన ముప్పావుగంట ఎపిసోడ్ అంతే ఫాస్ట్ గా సాగుతూ ఆకట్టుకోగా అప్పుడు గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ రావడం…ఆ సీన్ అంతా…
మరో ట్రాన్స్ లో వెల్లిపోయేలా చేస్తుంది….ఆ తర్వాత మరో విలన్ ని పరిచయం చేస్తూ సాగిన కథ కొంచం ఫ్లో తప్పినట్లు అనిపించినా డైరెక్టర్ గా సుకుమార్ ఈ సారి కథ పరంగా కాకుండా స్క్రీన్ ప్లే తో ఫుల్ మార్కులు కొట్టేసి సినిమాను నిలబెట్టాడు…..
ఇక అల్లు అర్జున్ తన పెర్ఫార్మెన్స్ తో నట విశ్వరూపం చూపించాడు….పుష్ప పాత్రలో లీనం అయిపోయిన అల్లు అర్జున్ హీరోయిజం,యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని సీన్స్ తో దుమ్ము దులిపేశాడు…ఇక జాతర ఎపిసోడ్ తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే రేంజ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు…. రష్మిక తన రోల్ వరకు ఆకట్టుకోగా…ఫహాద్ ఫాజిల్ పర్వాలేదు అనిపించేలా నటించాడు…మిగిలిన యాక్టర్స్ ఓకే…ఇది పూర్తీగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో…
ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా మెప్పించాయి…హీరో ఎలివేషన్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం కష్టపడి సినిమాను 3 గంటల రేంజ్ రన్ టైంలో చేసి ఉంటే ఎక్స్ లెంట్ గా ఉండేది…ముఖ్యంగా కొన్ని రష్మిక సీన్స్ అలాగే సెకెండ్ ఆఫ్ లో జాతర ఎపిసోడ్ తర్వాత డ్రాగ్ అయిన సీన్స్ ను తగ్గించి ఉంటే మరింత క్రిస్ప్ గా ఉండేది సినిమా….
ఓవరాల్ గా పుష్ప2 మూవీ ఫక్తు కమర్షియల్ పాయింట్స్ తో హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో నిండిపోయిన ఊరమాస్ మూవీ…కొన్ని డౌన్ ఫాల్స్ ఉన్నా కూడా చాలా వరకు సీక్వెల్ పై ఉన్న క్రేజ్ దృశ్యా ఆ అంచనాలను మ్యాచ్ చేసిన సినిమా అని చెప్పొచ్చు…
లెంత్ విషయం, పెద్దగా కొత్త కథ ఏమి లేకపోవడం, అక్కడక్కడా డ్రాగ్ అయినట్లు అనిపించడం లాంటివి మైనస్ లు ఉన్నా కూడా 3 గంటల 20 నిమిషాల్లో ఎక్కువ పార్ట్ ఆడియన్స్ అంచనాలను మ్యాచ్ చేస్తూ…కొన్ని చోట్ల అంచనాలను మించిపోయి ఓవరాల్ గా హైప్ కి తగ్గ సీక్వెల్ అనిపించేలానే ఎండ్ అవుతుంది…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్…