బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, మమ్మోత్ బిజినెస్ ను సాధించగా రిలీజ్ అవ్వడం కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు రోజు సినిమా కి…..
అత్యంత భారీ ఎత్తున స్పెషల్ బెనిఫిట్ షోలను ప్లాన్ చేశారు…. మిడ్ నైట్ షోల కన్నా ముందు స్పెషల్ ప్రీమియర్ షోలను గ్రాండ్ గా ప్లాన్ చేయగా టికెట్ రేట్స్ ను అఫీషియల్ గానే బుక్ మై షోలో భారీ రేట్స్ కి అమ్మారు….దాంతో ఆక్యుపెన్సీ అనుకున్న రేంజ్ లో లేకున్నా కూడా…
భారీ టికెట్ హైక్స్ హెల్ప్ తో సినిమా రిమార్కబుల్ వసూళ్ళని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…ఆన్ లైన్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ తోనే సినిమా సుమారు 14.5 కోట్లకు పైగా గ్రాస్ ను ఆల్ ఓవర్ ఇండియాలో 650 రేంజ్ లో షోలతో సొంతం చేసుకుంది…
ఆఫ్ లైన్ లో కూడా టికెట్ సేల్స్ బాగానే జోరు చూపించడంతో సినిమా 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను స్పెషల్ ప్రీమియర్ షోలతో సొంతం చేసుకుని రిమార్కబుల్ జాతర సృష్టించింది…స్పెషల్ ప్రీమియర్ షోల పరంగా ఇవి బిగ్గెస్ట్ రిపోర్ట్ అయిన గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పాలి.
చాలా వరకు ఇలా స్పెషల్ మిడ్ నైట్ షోల టికెట్ సేల్స్ అన్నీ ఆఫ్ లైన్ లోనే జరిగిపోతాయి. కానీ ఈ సారి నిర్మాతలు అన్నీ ఆన్ లైన్ లోనే పెట్టేశారు…టికెట్ హైక్స్ చూసి చాలా మంది వెనక్కి తగ్గడం లాంటివి జరగడంతో ఆక్యుపెన్సీ అనుకున్న రేంజ్ లో…
పడకపోయినా కూడా ఓవరాల్ గా గ్రాస్ మాత్రం రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో సొంతం అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేస్తున్న పుష్ప2 మూవీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో రికార్డుల జాతర సృష్టిస్తాయో చూడాలి ఇప్పుడు.