బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా, ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగానే రిలీజ్ అవ్వగా…సినిమా జానర్ కంప్లీట్ గా పక్కా మాస్ కమర్షియల్ మూవీ అయినా కూడా…
ఓవర్సీస్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసింది…అక్కడ టాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ కన్నా కూడా భారీ లెవల్ లో షోలు, లొకేషన్స్ లో సినిమా రిలీజ్ ను కన్ఫాం చేసుకోవడంతో ఇక ఓవర్సీస్ లో కూడా రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు…
ముందు సెన్సేషనల్ జోరు చూపించినా కూడా తర్వాత కొంచం స్లో అవ్వగా రిలీజ్ టైంకి రికార్డులు సృష్టిస్తుంది అనుకున్నా కూడా ఇప్పుడు ఓవరాల్ గా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత రిపోర్ట్ అయిన లోకేషన్స్ లో సాధించిన కలెక్షన్స్ తో…
3.1 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది…కొన్ని లోకేషన్స్ రిపోర్ట్ చేయాల్సి ఉండగా కొంచం కలెక్షన్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉండగా ఓవరాల్ గా ప్రీమియర్స్ తో అక్కడ కూడా రికార్డ్ కొడుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా అమెరికాలో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్..
ప్రీమియర్స్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి ప్లేస్ లో కల్కి మూవీ 3.9 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్ళని అందుకోగా రెండో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ 3.5 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్ళని అందుకోగా ఇప్పుడు టాప్ 3 ప్లేస్ లో పుష్ప2 మూవీ నిలిచింది…
ఇక నాలుగో ప్లేస్ లో దేవర మూవీ 2.85 మిలియన్ డాలర్స్ ను అందుకోగా 5వ ప్లేస్ లో సలార్ మూవీ 2.6 మిలియన్ డాలర్స్ తో నిలిచాయి. పుష్ప2 మీద ఉన్న హైప్ కి రికార్డులు ఖాయం అనుకున్నా రికార్డ్ కొట్టలేదు కానీ అదే టైంలో…
సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకోవడం మాత్రం భీభత్సం అనే చెప్పాలి…సినిమాకి అక్కడ నుండి టాక్ కూడా బాగానే ఉండటంతో లాంగ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.