Home న్యూస్ పుష్ప2 హిందీ 1st డే ఓపెనింగ్స్..వీర కుమ్ముడు సామి ఇదీ!!

పుష్ప2 హిందీ 1st డే ఓపెనింగ్స్..వీర కుమ్ముడు సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మీద ముందు నుండి కూడా హిందీ మార్కెట్ లో ఓ రేంజ్ లో హైప్ ఉంది…అక్కడ మొదటి పార్ట్ సాధించిన ఊహకందని సక్సెస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు…

ఆ మొదటి పార్ట్ సక్సెస్ వలన రెండో పార్ట్ మీద హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది…ఇక పుష్ప2 సినిమా హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఓ రేంజ్ లో కుమ్మేసే ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది… కానీ సాలిడ్ స్టార్ట్ తర్వాత కొంచం స్లో అయినా కూడా ఇప్పుడు సినిమా కి…

అక్కడ ఆడియన్స్ నుండి కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వడంతో కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో కుమ్మేసే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా డబ్బింగ్ మూవీస్ పరంగా…

సినిమా అక్కడ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా అదే టైంలో సినిమా బాలీవుడ్ బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ ని కూడా అందుకోవడానికి ఛాన్స్ ఎంతైనా ఉంది…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే కంప్లీట్ గా మాస్ సెంటర్స్ లో సినిమా…

అనుకున్న రేంజ్ లో కనుక పెర్ఫార్మ్ చేస్తే మొదటి రోజు కలెక్షన్స్ పరంగా హిందీలో 55-60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే సినిమా 62-65 కోట్ల రేంజ్ దాకా కూడా…

వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు….ఒక డబ్బింగ్ మూవీ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించే లెవల్ లో ఓపెనింగ్స్ హిందీలో సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సినిమా మీద ఉన్న హైప్ అలాంటిది కాబట్టి మొదటి రోజు సినిమా అంచనాలను మించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here