బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా రికార్డుల దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది. మొదటి రోజు సినిమా అన్ని ఏరియాల్లో ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్ ఏరియా అయిన రాయలసీమ ఏరియాలో ఈ సినిమా ఇప్పుడు సంచలనం సృష్టించింది…
మొదటి రోజు ఇక్కడ నాన్ ఆర్ ఆర్ ఆర్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది….ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి సినిమా ఓవరాల్ గా 12.48 కోట్ల రేంజ్ లో షేర్ ని మొదటి రోజు అందుకోగా అందులో 3.38 కోట్ల రేంజ్ లో హైర్స్ యాడ్ అయినట్లు అంచనా…
దాంతో వర్త్ షేర్ పరంగా సినిమా మొదటి రోజున 9.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో తొలిరోజు నాన్ ఆర్ ఆర్ ఆర్ మూవీస్ లో 10 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న సినిమాగా పుష్ప2 మూవీ ఇప్పుడు సంచలనం సృష్టించింది…. ఇందులో ప్రీమియర్స్ కలెక్షన్స్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి….
ఓవరాల్ గా ప్రీమియర్స్ ద్వారానే సినిమాకి 1.8 కోట్ల రేంజ్ షేర్ సొంతం అయినట్లు అంచనా…ఇక మొదటి రోజు 7.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా అన్నీ కలిపి భారీ టికెట్ హైక్స్ హెల్ప్ తో సరికొత్త నాన్ ఆర్ ఆర్ రికార్డ్ ను నమోదు చేసింది…కానీ అదే టైంలో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం…
రాయలసీమ ఏరియాలో ఎన్టీఆర్(Jr NTR) దేవర(Devara part 1) 8.4 కోట్లకు పైగా వర్త్ షేర్ ని మొదటి రోజున సొంతం చేసుకుంది…దేవర కి కూడా స్పెషల్ షోలు పడినా అవి మిడ్ నైట్ లో పడ్డాయి…పుష్ప2 కి ముందు రోజు నుండి షోలు పడ్డాయి… ఎక్కువ టికెట్ రేట్స్ కూడా ఉండటం కలిసి వచ్చి…
ఓవరాల్ గా రాయలసీమ ఏరియాలో ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను నమోదు చేశాడు అల్లు అర్జున్….ఈ రేంజ్ లో సినిమా ఇక్కడ భీభత్సం సృష్టిస్తుంది అని ఎక్స్ పెర్ట్ చేయలేదు… ఇక భారీ లెవల్ లో ఇక్కడ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప2 ఎలాంటి రికవరీని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటుందో చూడాలి…