బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించింది. సినిమా మొదటి రోజు ఇప్పుడు…
ఒక్కో ఏరియాలో సాధిస్తున్న కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా నైజాం ఏరియాలో మొదటి రోజున సాధించిన ఎపిక్ కలెక్షన్స్ రాంపెజ్ ఏకంగా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది. సినిమా కి టాలీవుడ్ చరిత్రలోనే ఏ సినిమాకి కూడా సొంతం అవ్వని రేంజ్ లో టికెట్ హైక్స్ సొంతం అయ్యాయి…
స్పెషల్ ప్రీమియర్ షోల ద్వారానే రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా నైజాం నుండే మాస్ కలెక్షన్స్ ని సాధించింది…వాటితో కలిపి మొదటి రోజు కలెక్షన్స్ లెక్క అంచనాలను మించి పోయింది…. 25 కోట్ల మార్క్ షేర్ ని మొదటి రోజు అందుకోవడం అయితే ఖాయం అనుకోగా సినిమా…
ఓవరాల్ గా అన్ని అంచనాలను మించి పోయి మొదటి రోజు నైజాం ఏరియాలో 25.60 కోట్ల మమ్మోత్ షేర్ ని ప్రీమియర్స్, హైర్స్ మరియు GST రిటర్న్స్ తో కలిపి సొంతం చేసుకుని సరికొత్త సంచలన రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు…ఇది వరకు ఇక్కడ ఆర్ ఆర్ ఆర్ మూవీ…
మొదటి రోజు ఊహకందని రేంజ్ లో 23.35 కోట్ల షేర్ ఓపెనింగ్స్ ను నమోదు చేసి రికార్డ్ కొట్టింది….ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో పోల్చితే భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ అయిన పుష్ప2 మూవీ సరికొత్త రికార్డ్ ను ప్రీమియర్స్ హెల్ప్ తో నమోదు చేసింది. ఇక సినిమా నమోదు చేసిన ఈ రికార్డ్ ఫ్యూచర్ లో ఏ సినిమా అందుకుంటుందో చూడాలి…
Nuvvu nee overaction….. tickets hike n special padi kuda overall ga Ap n Ts lu pikindindi emiledu ….gummunu undavayya chaalu