బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో మాస్ రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా ఊహకందని ఓపెనింగ్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులనే కాదు ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసి దుమ్ము దుమారం లేపింది…
సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మరీ అంచనాలను మించిపోలేక పోయింది కానీ మిగిలిన చోట్ల మాత్రం ఊరమాస్ రాంపెజ్ ను చూపించింది సినిమా….తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని 70 కోట్లకు పైగా షేర్ ని దక్కించుకుని ఓ రేంజ్ లో కుమ్మేసింది…
ఇక హిందీలో అంచనాలను మించి పోయిన సినిమా తమిళనాడు, కర్ణాటకలో మాస్ ఊచకోత కోసింది. కేరళలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకున్నా కూడా టాలీవుడ్ తరుపున అక్కడ కూడా రికార్డ్ కొట్టింది. ఇక ఓవర్సీస్ లో పక్కా కమర్షియల్ మూవీతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను అందుకుంది…
మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Here is Pushpa 2 The Rule 1st Day Total WW Collections(Inc Premieres, GST)
👉Nizam: 25.60Cr(INC Hires, Premieres)
👉Ceeded: 12.48Cr(3.38Cr Hires)
👉UA: 7.70Cr(Inc Hires)
👉East: 4.90Cr(2.10Cr Hires)
👉West: 4.45Cr(1.85Cr Hires)
👉Guntur: 7.60Cr(3Cr Hires)
👉Krishna: 5.20Cr(1.84Cr~ Hires)
👉Nellore: 2.88Cr(1.05Cr Hires)
(2.05CR~hires,Mgs, SGs added in several places)
AP-TG Total:- 70.81CR(97.50CR~ Gross)(15.27Cr~ Hires)
👉KA: 12.05Cr(22Cr Gross)
👉Tamilnadu: 5.90Cr(11.05Cr~ Gross)
👉Kerala: 2.85Cr(6.35Cr~ Gross)
👉Hindi+ROI : 36.40Cr(81.60Cr~ Gross)
👉OS – 32.00Cr(67.05Cr~ Gross)***Approx
Total WW Collections : 160.01CR (Gross- 285.55CR~)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 620 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన ఇండియన్ రికార్డ్ కలెక్షన్స్ కాకుండా ఇంకా 460 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది…
సినిమా లాంగ్ వీకెండ్ లో ఇప్పుడు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా హిందీలో హోల్డ్ చేస్తున్న తీరుకి తెలుగు రాష్ట్రాలు అలాగే ఇతర వర్షన్ లు సరిగ్గా సపోర్ట్ చేస్తే సాలిడ్ రికవరీని వీకెండ్ లోనే సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది..