ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం హిస్టారికల్ డే 1 రికార్డుల ఊచకోత కోసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, దుమ్ము దుమారం రేపే స్టార్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాలిడ్ టికెట్ హైక్స్ ఇంపాక్ట్ వలన డ్రాప్స్ కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది…
మార్నింగ్ మ్యాట్నీ షోలకు కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో, మేకర్స్ కొంచం తేరుకుని వెంటనే మేజర్ సెంటర్స్ లో టికెట్ హైక్స్ ని తగ్గించారు…దాంతో మ్యాట్నీ షోల నుండి సినిమా హోల్డ్ చూపించడం మొదలు పెట్టగా ఓవరాల్ గా డే 1 తో పోల్చితే డే 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
65-70% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపించగా తర్వాత తేరుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 20 కోట్ల రేంజ్ దాకా వెళ్ళొచ్చు..
కానీ సినిమాకి మొదటి రోజు వచ్చిన టాక్ కి ఇంతకు మించిన భీభత్సం సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. ఇక హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తున్న సినిమా తెలుగుకి మించి ఈ రోజు 24-26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…
ఇక కర్ణాటకలో 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళ్ అండ్ కేరళలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ రెండు చోట్లా కలిపి 5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా ఓవరాల్ గా 2 మిలియన్ డాలర్స్ కి…
అటూ ఇటూగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద అన్ని చోట్లా సినిమా రెండో రోజు 62-64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది….ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగవచ్చు…తెలుగు లో అనుకున్న రేంజ్ లో కుమ్మేసి ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండేది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.