బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీ వసూళ్ళతో భీభత్సం సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి…కొత్త రికార్డులు అప్పుడప్పుడు నమోదు అవుతూ ఉండగా, సినిమాల క్రేజ్ ను బట్టి అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు భారీగా టికెట్ హైక్స్ తో పాటు భారీగా హైర్స్ కూడా కలిసివస్తూ ఉన్నాయి అని చెప్పొచ్చు….
హైర్స్ అంటే….ఒక ఏరియాను గంపగుత్తుగా భారీ రేటు పెట్టి కొంటారు…ఇక ఆ ఏరియాలో వచ్చే కలెక్షన్స్ అన్నీ కొన్న వాళ్ళకే వెళతాయి….కొన్న రేటు అమౌంట్ ను మొదటి రోజు, వీకెండ్, వీక్ ఎండ్ లోపు కలిపి షేర్ ని అప్ డేట్ చేస్తూ ఉంటారు…రీసెంట్ టైంలో చాలా వరకు సినిమాలకు హైర్స్ ను…
మొదటి రోజే కలుపుతూ ఉండగా టాలీవుడ్ లో మొదటి రోజు కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయి…దాంతో హైర్స్ కాకుండా హైయెస్ట్ వర్త్ షేర్ ని మొదటి రోజు అందుకున్న సినిమాల్లో టాలీవుడ్ నుండి 3 సినిమాలు ఫస్ట్ డే 50 కోట్లకు పైగా వర్త్ షేర్ ని సొంతం చేసుకున్నాయి…
ముందు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ రికార్డ్ కొట్టగా రీసెంట్ గా దేవర ఈ రికార్డ్ కొట్టింది…ఇప్పుడు పుష్ప2 మూవీ టాప్ 2 బిగ్గెస్ట్ వర్త్ షేర్ ని మొదటి రోజున సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. మొదటి రోజు 15.27 కోట్ల హైర్స్ సొంతం కాగా వర్త్ షేర్ ఆల్ మోస్ట్ 55.5 కోట్లకు పైగా ఉండటం విశేషం…
ఒకసారి టాలీవుడ్ లో టాప్ వర్త్ షేర్ రికార్డులు సాధించిన టాప్ సినిమాలను గమనిస్తే…
Tollywood Top Day 1 Shares Without Hires(AP TG)
👉#RRR MOVIE – 58.67CR(15.44Cr hires)
👉#Pushpa 2 The Rule – 55.54CR(15.27Cr Hires)💥💥💥💥
👉#Devara Part 1 – 50.42CR(11.23Cr Hires)
👉#SALAAR – 46.33CR(3.96Cr Hires)
👉#KALKI 2898 AD – 43.36CR(1.50Cr~ Hires)
👉#BAAHUBALI2 – 32.20CR(10.80Cr Hires)
👉#GunturKaaram- 32.10C(6.78Cr~ hires)
👉#AdiPurush- 30.84C(2Cr~ hires)
👉#Saaho- 29.27C(7.25C hires)
👉#SarkaruVaariPaata – 28CR(8.01CR Hires)
👉#VakeelSaab- 26.24Cr(6Cr Hires)
👉#SarileruNeekevvaru- 24.75C(8.02C)
👉#Syeraa- 24.72C(14.03C)
👉#AravindhaSametha-23.34C(3.3C)
👉#BheemlaNayak – 22.73CR(3.69Cr)
మొత్తం మీద ఇవి హైయెస్ట్ వర్త్ షేర్ రికార్డులు సాధించిన సినిమాలు. పుష్ప2 కి ప్రీమియర్స్ కలెక్షన్స్ అండ్ హ్యూజ్ టికెట్ హైక్స్ భారీగా హెల్ప్ చేశాయి అని చెప్పొచ్చు… ఇక అప్ కమింగ్ టైం లో మరిన్ని భారీ సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ లిస్టులో ఇంకా ఎన్ని సినిమాలు చేరుతాయో చూడాలి…