బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్స్ తో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుని మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత రెండో రోజు వర్కింగ్ డే లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని తెలుగు రాష్ట్రాల్లో చూపించింది…. ఓవరాల్ గా డే 2 కలెక్షన్స్ స్టడీగా ఉన్నా…
సినిమా మీద పెట్టిన రేటుకి, ఇచ్చిన టికెట్ హైక్స్, వచ్చిన రివ్యూలకు ఇంకా ఎక్కువ వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ పెర్ట్ చేసారు అందరూ… కానీ భారీ టికెట్ హైక్స్ వలన రెండో రోజు అనుకున్న దాని కన్నా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా..
తిరిగి ఈవినింగ్ షోల టైం కి రేట్స్ ని కొద్ది వరకు తగ్గించడం కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా మంచి జోరు నే చూపించి వీకెండ్ మీద ఆశలు పెరిగేలా చేసింది… ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 18-20 కోట్ల దాకా వెళ్ళొచ్చు అనుకోగా సినిమా మొత్తం మీద 19.25 కోట్ల రేంజ్ లో షేర్ ని…
తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున సొంతం చేసుకుంది ఇప్పుడు…ఇక సినిమా ఓవరాల్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Pushpa 2 The Rule 2 Days Telugu States Total Collections(Inc GST)
👉Nizam: 36.18Cr
👉Ceeded: 15.46Cr
👉UA: 9.61Cr
👉East: 5.83Cr
👉West: 5.07Cr
👉Guntur: 8.38Cr
👉Krishna: 6.11Cr
👉Nellore: 3.42Cr
AP-TG Total:- 90.06CR(126.65CR~ Gross)
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్ల దాకా ఉండగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 125 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 3-4 రోజుల్లో రెట్టించిన జోరు చూపించి సాలిడ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది…