మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రికార్డులను సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా రెండో రోజు మరోసారి ఫుల్ వర్కింగ్ డే లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో జోరు ని చూపించి కుమ్మేసింది…
దాంతో రెండో రోజు కూడా వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పుష్ప2 సినిమా సంచలనం సృష్టించింది.. తెలుగు రాష్ట్రాల్లో కొంచం ఎక్కువ డ్రాప్ అయినా మిగిలిన చోట్ల మాత్రం సినిమా సాలిడ్ గానే కుమ్మేసింది.. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా అనుకున్న అంచనాల ప్రకారమే…
వసూళ్ళని అందుకున్న సినిమా 19.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 60 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకుంటే హిందీ లో ఓవర్సీస్ లో మాసివ్ ట్రెండ్ ను చూపించడం కలిసి రావడంతో…
వరల్డ్ వైడ్ గా సినిమా 69.45 కోట్ల రేంజ్ లో షేర్ ని 139.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ జోరు ని చూపించింది. లాంగ్ రన్ లో సినిమా వరల్డ్ వైడ్ గా మరిన్ని రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 2 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 36.18Cr
👉Ceeded: 15.46Cr
👉UA: 9.61Cr
👉East: 5.83Cr
👉West: 5.07Cr
👉Guntur: 8.38Cr
👉Krishna: 6.11Cr
👉Nellore: 3.42Cr
AP-TG Total:- 90.06CR(126.65CR~ Gross)
👉KA: 17.10Cr
👉Tamilnadu: 9.90Cr
👉Kerala: 3.80Cr
👉Hindi+ROI : 63.10Cr
👉OS – 45.50Cr***Approx
Total WW Collections : 229.46CR(Gross- 425.10CR~)
మొత్తం మీద సినిమా 620 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజులలో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 390 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా శని ఆదివారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.