బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సాలిడ్ ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు ఫుల్ వర్కింగ్ డే ఇంపాక్ట్ అలాగే హెవీ టికెట్ హైక్స్ వలన కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…
అయినా కూడా ఉన్నంతలో ఆల్ టైం సెకెండ్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచి మాస్ రచ్చ చేసింది ఈ సినిమా… రెండో రోజు 18-20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా ఓవరాల్ గా సినిమా మంచి జోరునే చూపించి..
రెండో రోజు 19.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది…టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా పుష్ప2 మూవీ టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుంది…. ఫస్ట్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో…
దూసుకు పోతూ ఉండగా ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను అందుకోవడం ఇతర సినిమాలకు చాలా కష్టమే అనే చెప్పాలి. ఇక రెండు మూడు ప్లేసులలో ప్రభాస్ నటించిన సలార్ మరియు కల్కి సినిమాలు నిలవగా 4వ ప్లేస్ లో పుష్ప2 సినిమా నిలిచింది…ఒకసారి రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో…
ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
2nd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 31.63CR
👉#Salaar- 21.23CR
👉#Kalki2898AD – 20.00CR
👉#Pushpa2TheRule – 19.25CR******
👉#Devara Part 1 – 17.92CR
👉#AdiPurush – 15.04CR
👉#Baahubali2 -14.80Cr
👉#Pushpa – 13.70Cr
👉#KGF2(Dub)- 13.37CR
👉#BheemlaNayak – 13.14Cr
👉#RadheShyam – 12.34Cr
👉#WaltairVeerayya – 11.95CR
👉#SarkaruVaariPaata – 11.04Cr
మొత్తం మీద టాప్ 4 ప్లేస్ లో ఉన్న పుష్ప2 మూవీ లాంగ్ రన్ లో ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి…ఇక ఫ్యూచర్ లో RRR డే 2 రికార్డ్ ను ఏ సినిమా అయినా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.