రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా రెండు రోజుల్లో ఓవరాల్ గా రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అంచనాలను మించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న రేంజ్ లో రచ్చ చేసి ఉంటే లెక్క ఇంకా జోరుగా ఉండేది…
ఇక మూడో రోజులో అడుగు పెట్టిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో హోల్డ్ ఒకెత్తు అయితే హిందీలో చూపిస్తున్న హోల్డ్ రేంజ్ మరో ఎత్తుగా చెప్పాలి ఇప్పుడు. అక్కడ సినిమా హోల్డ్ మరో లెవల్ లో రాంపెజ్ ను తలపిస్తూ దూసుకు పోతుంది. ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సినిమా…
రెండో రోజుతో పోల్చితే సిమిలర్ గా ఓపెనింగ్స్ ను మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకున్నా ఈవినింగ్ షోల నుండి బుకింగ్స్ ట్రెండ్ లో గ్రోత్ కనిపించింది. నైజాం అండ్ సీడెడ్ లో మాస్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా ఆంధ్ర లో హోల్డ్ మరీ అనుకున్న రేంజ్ లో లేక పోయినా కూడా…
ఓవరాల్ గా మూడో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 20-21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపొతే కనుక షేర్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది… ఇక హిందీ లో మాత్రం ఏమాత్రం జోరు తగ్గకుండా దూసుకు పోతున్న సినిమా…
ఆల్ మోస్ట్ మొదటి రోజు కి దగ్గర అయ్యే రేంజ్ లో జోరు చూపిస్తూ ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే హిందీలో 67-70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు….ఇక తమిళనాడు లో కూడా మొదటి రోజుకి దగ్గర అయ్యే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా…
ఈ రోజు ఇక్కడ 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక లో కూడా మాస్ హోల్డ్ ని చూపించగా అక్కడ కూడా 5 కోట్లకు పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కేరళలో మాత్రం సినిమా ట్రెండ్ వీక్ గా ఉంది. ఓవర్సీస్ లో మాస్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా…అక్కడ మొత్తం మీద….
మరోసారి 3 మిలియన్ డాలర్స్ రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున ఇప్పుడు 72-74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా మించిపోవచ్చు. ఇక అఫీషియల్ 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.