బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఖాన్ ల డామినేషన్ ఎక్కువ….మిగిలిన హీరోల సినిమాలు అడపాదడపా హిట్స్ అయినా కూడా బాలీవుడ్ ఖాన్స్, షారుఖ్, సల్మాన్ మరియు అమీర్ ఖాన్ లాంటి టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సినిమాల రికార్డులు ఇక మరో లెవల్ లో ఉంటాయి. సౌత్ నుండి హిందీలో డబ్ అయ్యే సినిమాల పరంగా…
కొన్ని సినిమాలు ఊహకందని రాంపెజ్ ను చూపించినా కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఖాన్ మూవీస్ దే కొంచం డామినేషన్ ఎక్కువగా ఉండగా ఇప్పుడు ఎవ్వరి సినిమాల రికార్డులను కూడా వదలకుండా, రికార్డ్ ముక్క కూడా మిగలకుండా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ…
సౌత్ డబ్బింగ్ మూవీస్ పరంగానే కాకుండా హిందీలో స్ట్రైట్ బిగ్ మూవీస్ ని సైతం డామినేట్ చేస్తూ చరిత్ర కెక్కే కలెక్షన్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతుంది ఇప్పుడు…
రెండు రోజుల్లోనే అక్కడ ఏకంగా 131 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా మూడో రోజు ఏకంగా మొదటి రోజుకి మించి పోయే రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ మినిమమ్ 72 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని ఇప్పుడు మూడో రోజున సొంతం చేసుకోబోతూ ఉండగా…
బాలీవుడ్ లో ఆల్ మోస్ట్ ఫాస్టెస్ట్ 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని 3 రోజుల గ్యాప్ లోనే అందుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు….మూడో రోజు సాధించే కలెక్షన్స్ తో హిందీలో సినిమా 200 కోట్ల మార్క్ ని దాటేసి 205 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా నెట్ కలెక్షన్స్ తో…
మాస్ రికార్డ్ ను నమోదు చేయబోతూ ఉండగా సినిమా 4వ రోజు సండే అవ్వడంతో మరోసారి అన్ని రికార్డుల బెండు తీస్తూ బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ ని హిందీలో నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. సినిమా ఊపు చూస్తుంటే హిందీలో ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.