బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో కుమ్మేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కొంచం రేట్స్ ఇంపాక్ట్ వలన స్లో అయినా కూడా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా జోరు చూపించి కుమ్మేసింది..
అనుకున్న అంచనాల కన్నా కూడా బెటర్ గానే వసూళ్ళని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలనం సృష్టించింది సినిమా…. తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు గ్రోత్ చూసిన తర్వాత 20-21 కోట్ల రేంజ్ లో షేర్ కన్ఫాం అనుకోగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందీ అనుకోగా…
ఓవరాల్ గా సినిమా 21.60 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సాలిడ్ గా జోరు చూపించింది. అందులో 12 కోట్లకు పైగా షేర్ ఒక్క నైజాం ఏరియా నుండే రావడం రాయలసీమ కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించడం సినిమా ఈ ఏరియాల్లో చూపెడుతున్న స్ట్రాంగ్ హోల్డ్ కి నిదర్శనం అని చెప్పాలి…
మొత్తం మీద సినిమా ఇప్పుడు 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 3 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 48.43Cr
👉Ceeded: 18.50Cr
👉UA: 11.69Cr
👉East: 6.78Cr
👉West: 5.79Cr
👉Guntur: 9.30Cr
👉Krishna: 7.17Cr
👉Nellore: 4.00Cr
AP-TG Total:- 111.64CR(160.25CR~ Gross)
మొత్తం మీద 112 కోట్లకు పైగా షేర్ మార్క్ ని మూడు రోజుల్లోనే సొంతం చేసుకున్న సినిమా ఇక్కడ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే మరో 104 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ రోజు సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి.