బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, మొదటి 2 రోజుల్లోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకోగా మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో…
బాక్స్ ఆఫీస్ భీభత్సం సృష్టించి అల్లకల్లోలం సృష్టించింది…సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 20-21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 21.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. హిందీలో 70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అని అనుకుంటే ఏకంగా రికార్డుల బెండు తీస్తూ…
ఏకంగా 74 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక కర్ణాటకలో తమిళనాడులో ఓ రేంజ్ లో కుమ్మేసిన సినిమా కేరళలో దెబ్బ పడినా ఓవర్సీస్ లో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించడంతో వరల్డ్ వైడ్ గా అంచనాలను మూడో రోజు మించి పోయింది…
వరల్డ్ వైడ్ గా 70 కోట్ల రేంజ్ లో షేర్ ఖాయం అనుకుంటే హిందీలో మాసివ్ గ్రోత్ హెల్ప్ తో సినిమా ఏకంగా 80 కోట్ల రేంజ్ లో షేర్ ని మూడో రోజున సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ 150 కోట్లకు పైగా ఉండటం ఖాయం అనుకుంటే మళ్ళీ హిందీ హెల్ప్ తో అంచనాలను మించి పోయి 168 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
దాంతో టోటల్ గా ఇప్పుడు 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 3 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 48.43Cr
👉Ceeded: 18.50Cr
👉UA: 11.69Cr
👉East: 6.78Cr
👉West: 5.79Cr
👉Guntur: 9.30Cr
👉Krishna: 7.17Cr
👉Nellore: 4.00Cr
AP-TG Total:- 111.66CR(160.25CR~ Gross)
👉KA: 23.85Cr
👉Tamilnadu: 14.95Cr
👉Kerala: 4.85Cr
👉Hindi+ROI : 96.95Cr
👉OS – 57.25Cr***Approx
Total WW Collections : 309.51CR(Gross- 593.90CR~)
(50%~ Recovery)
ఓవరాల్ గా 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగం రికవరీని ఆల్ మోస్ట్ సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం ఇప్పుడు మరో 310 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ రన్ లో సినిమా మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…