మిగిలిన చోట్ల దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ హైక్స్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా రెండో రోజు డ్రాప్ అయిన తర్వాత మూడో రోజు తిరిగి టికెట్ హైక్స్ చాలా చోట్ల నార్మల్ చేయడంతో…
మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఎక్స్ లెంట్ గానే ట్రెండ్ అయ్యి 21.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించి అనుకున్న రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని కుమ్మేసింది…
కాగా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సాలిడ్ గానే కుమ్మేస్తూ ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది ఇప్పుడు. మొదటి ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా రెండో ప్లేస్ లో…
సలార్ మూవీ నిలిచింది…..మూడో రోజు టికెట్ హైక్స్ తగ్గడం వలన ఆక్యుపెన్సీ పెరిగినా వసూళ్లు కొంచం తగ్గడంతో సలార్ ని అందుకోలేక పోయిన పుష్ప2 మొత్తం మీద టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఒకసారి మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
3rd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 33.53CR
👉#Salaar- 22.40CR
👉#Pushpa2TheRule – 21.60CR*******
👉#Kalki2898AD – 19.83CR
👉#Devara Part 1 – 19.03CR
👉#AdiPurush – 17.07CR
👉#Baahubali2- 16.60Cr
👉#Pushpa- 14.38Cr
👉#BheemlaNayak- 13.51Cr
👉#WaltairVeerayya – 12.61CR
👉#SarkaruVaariPaata- 12.01CR
👉#AlaVaikunthapurramuloo- 11.21Cr
👉#Saaho- 11.16Cr
👉#RadheShyam- 10.58Cr
👉#BROTheAvatar- 10.48Cr
👉#VakeelSaab- 10.43Cr
మొత్తం మీద పుష్ప2 మూవీ టాప్ 3 ప్లేస్ ను మూడో రోజు సొంతం చేసుకున్నా 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో కచ్చితంగా మరింత జోరు పెంచే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.