ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా అన్ని చోట్లా చూపిస్తున్న హోల్డ్ ఒకెత్తు అయితే హిందీ మార్కెట్ లో చూపిస్తున్న జోరు మరో లెవల్ రాంపెజ్ అని చెప్పాలి ఇప్పుడు….రిలీజ్ అయిన రోజు నుండి రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తూ మాస్ హిస్టీరియా క్రియేట్ చేస్తూ…
బాలీవుడ్ బిగ్గెస్ట్ ఖాన్ మూవీస్ ఏవి కూడా కలలో కూడా ఊహించని రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా మొదటి రోజే 72 కోట్లతో చరిత్ర సృష్టిస్తే…మూడో రోజు మొదటి రోజుకి మించి పోయే రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ ఏకంగా 74 కోట్ల రేంజ్ లో…
నెట్ కలెక్షన్స్ తో మెంటల్ మాస్ జాతర సృష్టించింది…మూడో రోజు వీర లెవల్ లో కుమ్మేసిన తర్వాత ఇప్పుడు నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో సినిమా ఊహకందని రేంజ్ లో ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉండగా ఈ రోజు సినిమా హిందీ లో సాధించే కలెక్షన్స్…
బాలీవుడ్ చరిత్రలో నిలుచిపోవడం ఖాయమని చెప్పాలి. మూడో రోజు మీద మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఈ రోజు 78-80 కోట్ల రేంజ్ లో మమ్మోత్ నెట్ కలెక్షన్స్ ని హిందీలో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
బాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా ఒక రోజు 70 కోట్లు 75 కోట్లు ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే 80 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోబోతున్న మొట్ట మొదటి సినిమాగా నిలవనున్న పుష్ప2 సాధించే ఈ కలెక్షన్స్ చరిత్రలో నిలిచిపోయే ఛాన్స్ ఎంతైనా ఉంది.
సినిమా ఎక్స్ లెంట్ రాంపెజ్ ను చూస్తూ ఉంటే బాలీవుడ్ లో లాంగ్ రన్ లో అంచనాలను అన్నీ మించి పోతూ ఏకంగా 700 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు. మరి సినిమా లాంగ్ రన్ లో ఈ మార్క్ ని మించుతుందో లేదో చూడాలి.
Great movie 💥