ఇండియన్ మూవీస్ పరంగా ఒక నాటు కమర్షియల్ మూవీ తో కూడా అన్ని చోట్లా రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు అని నిరూపిస్తూ దూసుకు పోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా….రిలీజ్ అయిన రోజు నుండి ప్రతీ రోజూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
అన్ని చోట్లా రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇండియన్ మూవీస్ లో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని బెంచ్ మార్క్ లతో దూసుకు పోతూ ఉండగా లేటెస్ట్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది…
కాగా ఆల్ రెడీ ఫాస్టెస్ట్ 500 కోట్ల మమ్మోత్ రికార్డ్ ను నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు నాలుగో రోజు మార్నింగ్ షోల టైంకే మరో ఎపిక్ ఇండియన్ రికార్డ్ ను నమోదు చేసింది…ఫాస్టెస్ట్ 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఫాస్టెస్ట్ మూవీ గా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది.
ఇది వరకు రికార్డ్ 2017 టైంలో వచ్చిన ఎపిక్ ఇండియన్ హిట్ మూవీ అయిన బాహుబలి2 మూవీ 4 రోజుల్లో ఓవరాల్ గా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది… కానీ ఇప్పుడు ఒక పక్కా కమర్షియల్ మూవీ అయిన పుష్ప2 మూవీ కేవలం…
3 రోజుల మీద ఒక షో మొదలు అయ్యే టైంకే ఈ రికార్డ్ ను అందుకుని ఆల్ మోస్ట్ 3 రోజుల్లోనే 600 కోట్ల మమ్మోత్ రికార్డ్ ను నమోదు చేసి ఇండియన్ మూవీస్ లో చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ ను నమోదు చేసింది. ఇక మొదటి వీకెండ్ కి గాను సినిమా మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.