బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి రికార్డులను చెల్లాచెదురు చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 160 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేయగా వరల్డ్ వైడ్ గా కూడా…..
594 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళతో దుమ్ము దుమారం లేపింది. ఇక సినిమా నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేసింది. ఒక్క కేరళ తప్పితే మిగిలిన అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కుమ్మేస్తూ 34-36 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను….
సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 37 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా ఊచకోత ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో ఉండగా అవలీలగా సినిమా 96-98 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేయడం ఖాయంగా..
కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్క ఎక్కడ దాకా వెళుతుందో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇక కర్ణాటకలో సినిమా 13కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అనుకునే అవకాశం ఉండగా తమిళ్ లో 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…
ఇక కేరళలో మరోసారి సినిమా 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియాలో 4వ రోజున సినిమా ఇప్పుడు 158-160 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా మరోసారి సాలిడ్ హోల్డ్ ని చూపిస్తూ…
2.7-3 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజున ఇప్పుడు ఏకంగా 180-185 కోట్ల ఎపిక్ మమ్మోత్ గ్రాస్ ను అందుకునే అవకాశం మించిపోయే ఔట్ రైట్ ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు హిందీలో అంచనాలను మించిపోతే…
ఈ కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 195 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 770-780 కోట్ల ఎపిక్ రికార్డ్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ఎంతవరకు ఈ అంచనాలను అందుకుంటాయో లేక మించి పోతాయో చూడాలి ఇప్పుడు…