బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా వీర లెవల్ లో కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా హిందీలో చూపిస్తున్న జోరు మాత్రం మరో లెవల్ బ్రూటల్ రాంపెజ్ అని చెప్పాలి ఇప్పుడు…బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ కూడా సాధించని రేంజ్ లో ఈ సినిమా…
ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపగా 3 రోజుల్లో ఓవరాల్ గా 205 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో సినిమా చూపించిన జోరు ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి. కాగా ఈ క్రమంలో సినిమా డైరెక్ట్ గా హిందీ సినిమాల రికార్డులను అన్నీ బ్రేక్ చేస్తూ ఉండగా….
సౌత్ నుండి డబ్ అయిన సినిమాల టోటల్ రన్ కలెక్షన్స్ ని వీకెండ్ లోనే బ్రేక్ చేస్తూ ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…. కాగా ఈ క్రమంలో సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన RRR Movie హిందీ టోటల్ రన్ కలెక్షన్స్ ని జస్ట్ 4 రోజుల్లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు….
RRR మూవీ టోటల్ రన్ లో హిందీలో 277.40CR కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా కేవలం 4 రోజుల్లోనే ఇప్పుడు పుష్ప2 మూవీ హిందీలో బ్రేక్ చేసి సంచలనం సృష్టించి డబ్బింగ్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది…
ఈ క్రమంలో సినిమా 5వ రోజు వసూళ్ళ పరంగా ఈ ఇయర్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ అయిన కల్కి మూవీ సాధించిన 294.50CR కోట్ల నెట్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 300కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధం అవుతుంది….ఇక ఇదే ఊపు కొనసాగిస్తే రెండో వీకెండ్ లోపే డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.